Congress Party About Trump
అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున గుర్తులేని సంస్థతో స్వాగత ఏర్పాట్లు చేయడంపై కాంగ్రెస్ విస్మయం వ్యక్తంచేస్తోంది. నాగరిక్ అభినందన్ సమితి(డీటీఎన్ఏఎ్స) పేరుతొ చేస్తున్నారని పేర్కొంది. అయితే కనీసం అడ్రస్ కూడా లేని ఈ సంస్థే అహ్మదాబాద్‌లో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎవర్ని ఆహ్వానించాలో ఈ సమితే నిర్ణయం తీసుకుంటుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ ప్రకటించడంతో సమితి సంగతి తెరపైకి వచ్చింది.అహ్మదా బాద్‌లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద మోతేరా స్టేడియంలో 24న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు.
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు మోదీ, ట్రంప్ నిర్వహించే రోడ్‌షో కూడా సమితి పరిధిలోకి వస్తుందట. ఈ సమితికి అడ్రస్ లేకపోవడమే కాదు ఆన్‌లైన్‌లోనూ దాని జాడ కనిపించదు. గూగుల్‌లో వెతికినా ఓ పట్టాన దొరకదు. ‘‘ప్రధాని గారూ.. ట్రంప్ నాగరిక్ అభినందన్ సమితి అధ్యక్షుడు ఎవరు?’’ అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ప్రశ్నించారు. ‘నమస్తే ట్రంప్’లాంటి కార్యక్రమానికి 120 కోట్లు ఎలా ఖర్చు పెడతారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
ఇది చదవండి: భారత్ గురించి ట్రంప్ అలా అనేశారేంటి
కాగా, ఫేస్బుక్ ఫాలోవర్ల సం ఖ్య విషయంలో తానే ‘నంబర్ వన్’, ప్రధాని మోదీ ‘నంబర్ టూ’ అని ట్రంప్ మరోసారి గొప్పగా ప్రకటించుకుంటున్నారు. భారత్‌లో జనాభా ఎక్కువగా ఉండడం మోదీకి కలిసివచ్చిందని, అందుకే ఆయనకు అభినందనలు తెలిపానన్నారు. నిజానికి ఫేస్బుక్లో మోదీకి 4.40 కోట్ల మంది, ట్రంప్‌కు 2.70 లక్షల మంది మాత్రమే ఫాలవర్లు ఉన్నారు.