Thursday, December 2, 2021

Latest Posts

కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన ట్విట్టర్

Congress Party Official Twitter Account Locked

పోయిన వారం కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ యొక్క అఫిషియల్ అక్కౌంట్ ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ అయిన ట్విట్టర్ సస్పెండ్ చేసింది. అయితే అలా చేసిన కొన్ని గంటల్లోనే తిరిగి ఈ అక్కౌంట్ ని విడుదల చేసింది. ట్విట్టర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తంకి షాక్ ఇచ్చింది, ఈ సారి ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ని లాక్ చేసింది ఈ ప్లాట్ ఫార్మ్.

కాంగ్రెస్ పార్టీ వెరిఫైడ్ హ్యాండిల్‌ని ట్విట్టర్ ని నాలుగు రోజుల పాటు లాక్ చేసినట్లు సమాచారం. మోడీ ప్రభుత్వ వైఫల్యాల పై, కాంగ్రెస్ పార్టీ పై అనేక పోస్టులను షేర్ చేయడంతో లాక్ అయ్యినట్లు తెలుస్తుంది. పార్లమెంటులో పెగాసస్ వివాదం పై ట్విట్టర్ లో చర్చించడం పట్ల ఎన్‌డిఎ ప్రభుత్వం విముఖత చూపుతున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది.

 

View this post on Instagram

 

A post shared by Congress (@incindia)

కాంగ్రెస్ ఎక్కౌంట్ లాక్ కావడంతో, కాంగ్రెస్ నాయకులు ఇలా చెప్పినట్లు తెలుస్తుంది. మోడీ, ఎందుకంత భయం, కాంగ్రెస్ పార్టీ మన దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడింది, సత్యం, అహింస & ప్రజల సపోర్ట్ తో అప్పుడు మేం గెలిచాం, మళ్లీ గెలుస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ట్విట్టర్‌ ఇలా చేయడానికి గల కారణం  మోడీ ప్రభుత్వం నిర్దేశించిన కొత్త ఐ‌టి నియమాలుగా తెలుస్తుంది.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss