Corona attack on three year old baby in visakhapatnam
విశాఖ జిల్లాకు చెందిన వ్యక్తి కత్తిపూడి రాగా, అతనికి జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లాడు. ఐన జ్వరం తగ్గక పోవడంతో అనుమానం వచ్చి కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని అనుమానిచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. అక్కడ వారు కరోనా సోకినట్లు నిర్ధారించారు. అలాగే అతడు సన్నిహితంగా ఉన్న వారికి మరియు అతను నివశిస్తున్న చుట్టుపక్కల స్థానికులకు పరీక్షలు చేయగా, అతడి ద్వారా ఐదుగురికి వైరస్ వచ్చి నట్లు వైద్యులు నిర్థారించారు.
ఆ ఐదుగురిలో అతడి కూతురితో పాటూ బాధితుడి ఇంటికి వచ్చిన మరో మహిళకు, మరియు పక్క ఇంట్లో ఉండే మూడేళ్ల పాపకు, పాప తల్లి, నానమ్మలకు వైరస్ సోకినట్లు, కానీ వీరిలో కరోనా వైరస్ పెద్దగా లేవని తెలిపారు. వీరిని రాజమండ్రిలోని జీఎస్ఎల్ ఆస్పత్రికి తరలించారట. కాగా కత్తిపూడి వచ్చిన వ్యక్తిది సొంత జిల్లా విశాఖ కావడంతో విమ్స్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి నట్లు సమాచారం. మరోవైపు ఆ బాధితుడికి వైద్యం అందిచిన ఆర్ఎంపీ వైద్యుడిపై జిల్లా కలెక్టర్ వారిపై కేసులు నమోదు చేశారు. ఆస్పత్రిని, మరో ల్యాబ్‌ను సీజ్ చేసి, అక్కడ సిబ్బందిని క్వారంటైన్లో ఉంచారు.