Sunday, June 20, 2021

Latest Posts

ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ పెరిగిన కొత్త కరోనా కేసులు

Corona Cases In Andhra Pradesh Today News

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం కొత్తగా 15,284 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, దీనితో మొత్తం కేసుల సంఖ్య 16,09,105 కు చేరుకుంది. మే నెలలో రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి, రోజుకు సగటున 20,000 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో మరో 106 మంది చనిపోవడంతో, కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 10,328 కు పెరిగింది.

చిత్తూరులో 15, ప్రకాశంలో 11, పశ్చిమ గోదావరిలో 10, అనంతపూర్, తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్నంలో తొమ్మిది, కర్నూలు, విజయనగరంలో ఎనిమిది చొప్పున, శ్రీకాకుళంలో ఏడుగురు, గుంటూరు, కృష్ణాలలో ఐదుగురు మరణించారు.

మంగళవారం మొత్తం 20,917 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారని, కరోనా వస్తున్న వారి కంటే కోలుకున్న సంఖ్య వరుసగా మూడో రోజు ఎక్కువగా మారిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇంకా రాష్ట్రలో  ప్రస్తుతం 1.98 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. ఒక్క తూర్పు గోదావరిలో మాత్రమే 33,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తూర్పు గోదావరిలో కొత్తగా 2,663 కేసులు, తరువాత చిత్తూరు (1,970), విశాఖపట్నం (1,840) నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss