Monday, July 26, 2021

Latest Posts

ఏ‌పి‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona Cases In AP Decreased

కరోనా కేసులు దేశ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. ఆంధ్రాలో కూడా నిన్న మొన్నటి వరకు 10 వేలు దాటిన కేసులు ఇప్పుడు 5 వేల దిగువకు వచ్చాయి. చాలా జిల్లాల్లో కరోనా ప్రభావం దాదాపుగా తగ్గింది.  తాజా సమాచారం ప్రకారం గత 24 గంటల్లో 87756 కరోనా పరీక్షలు నిర్వహించగా 4500 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలానే కొత్తగా రాష్ట్రంలో 60 మరణాలు సంభవించాయి.

ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో నమోదైన 4549 కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 860 కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత తూర్పుగోదావరిలో 619, పశ్చిమగోదావరిలో 529 నమోదు అయ్యాయి. ఇక మిగిలిన అన్ని జిల్లాల్లో 500 కంటే తక్కువగా కేసులు నమోదు అయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18.14 లక్షలకు చేరింది. దీనిలో 17.22 లక్షల మంది కోలుకోగా మరో 80 వేల యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss