Sunday, July 25, 2021

Latest Posts

91 రోజుల తర్వాత అత్యల్పంగా నమోదైన కరోనా కేసులు

Corona Cases In India In Last 24 Hours

భారతదేశంలో కొత్త కోవిడ్ కేసుల తగ్గుదల కొనసాగుతోంది. గత 24 గంటల్లో, 42,640 కొత్త కేసులు నమోదయ్యాయి మరియు చివరి 91 రోజుల్లో ఇది అతి తక్కువగా నిలిచింది. మూడు నెలల తరువాత, నమోదయ్యిన కేసుల సంఖ్య 50,000 కన్నా తక్కువగా ఉంది. అలానే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7 లక్షలకు పడిపోగా, ప్రస్తుతం 6,62,521 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1167 మంది వైరస్ బారిన పడి చనిపోయారు దీనితో మొత్తం మరణాల సంఖ్య 3,89,302కి చేరింది.

ఇక దేశంలో టీకా తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. సోమవారం నుండి, 18 సంవత్సరాలు పై బడిన వారికి ఉచిత టీకాను ఇవ్వాలని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రారంభించిన మొదటి రోజు 86,16,373 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో టీకాలు వేయడం ప్రారంభించినప్పటి నుండి ఇది ఒక రికార్డు.

ఇప్పటివరకు దేశంలో వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య 28,87,66,201కి  చేరింది. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగనుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss