Sunday, June 20, 2021

Latest Posts

దేశంలో తగ్గుముఖం పట్టని కరోనా వైరస్ కేసులు

Corona Cases In India Today 24 Hours

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కేసుల నమోదు సంఖ్య రోజు రోజుకి తగ్గుతున్నప్పటికీ పరిస్థితులు ఇంకా భయంకరంగానే ఉన్నాయి. తాజాగా గురువారం భారతదేశంలో లక్షా 34 వేల కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే రెండు వేల కేసులు అధికంగా నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 21,59,873 కోవిడ్ టెస్ట్ లు చేయగా వాటిలో 1,34,154 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇకపోతే మరణాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది, గత 24 గంటల్లో మరణాలు 2,887 సంభవించాయి.

అయితే కరోనా బారీన పడిన వారికంటే కరోనా నుంచి కోలుకున్న వారు దేశంలో ఎక్కువగా నమోదు అవుతున్నారు. తాజాగా 2,11,499 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,63,90,584 మంది దేశంలో కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 17,13,413. ప్రస్తుతం దేశంలో, యాక్టివ్ కేసుల శాతం 6.34గా ఉండగా, మరణాల రేట్‌ 1.18 శాతం ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss