Sunday, June 20, 2021

Latest Posts

40 రోజుల తరువాత తగ్గుతున్న క‌రోనా కేసులు

Corona Cases In India Today Update

కొత్త కరోనావైరస్ కేసుల సంఖ్య భారతదేశంలో 40 రోజుల తరువాత 2 లక్షల మార్కు దిగువకు చేరుకుంది. గత 24 గంటల్లో 1,96,427 తాజా కేసులు నమోదు కాగా, 3,741 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.

ఏప్రిల్ 15న ఒక రోజులో 2 లక్షలకు పైగా కేసులను నమోదు చేసి భారతదేశంలో పరిస్థితి భయంకరంగా మారింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (మోహెచ్‌ఎఫ్‌డబ్ల్యు) ప్రకారం, గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 3,26,850 తాజా రికవరీలను నమోదు చేసిందని తెలిపారు.

భారతదేశంలో తాజాగా యాక్టివ్ కేసుల సంఖ్య 25,86,782 మందికి చేరుకుంది. ఇక మరణాల సంఖ్య 3,07,231 కు చేరుకోగా, రికవరీ సంఖ్య 2,40,54,861 కు చేరుకుంది.

కరోనా కేసుల సంఖ్యలో ఇటీవల మహారాష్ట్రను అధిగమించిన కర్ణాటక ఇప్పుడు 4,40,435 యాక్టివ్ కేసులతో భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో ఇంకా 3,27,580 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss