Corona diagnosed with RMP doctor in Dachepalli mandal
గుంటూరు జిల్లాలో దాచేపల్లి మండలంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ కి కరోనా సోకినట్లు నిర్ధారణ తో అక్కడ 300 మంది ప్రజలు కరోన పరీక్షలు చేయించుకునేందుకు ముందుకువచ్చారు. వివరలోకి వెళ్తే దాచేపల్లి మండలంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గడిచిన రెండు నెలలుగా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఎవరెవరు ట్రీట్మెంట్ తీసుకున్నారనే విషయాలను తెలుసుకుంటున్నారు.
అలాగే అతని దగ్గర గత రెండు నెలల కాలంలో వైద్యం చేయించుకున్న వారు అందరూ తమ అంతటా తాము వచ్చి కరోనా టెస్టులు చేయుంచుకోవాలని, లేని పక్షంలో వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు ఆ మహమ్మారి సోకే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలా అదికారులు హెచ్చరించడంతో దాదాపు మూడు వందల మంది వచ్చి టెస్ట్లు చేయెంచు కున్నారు. అలాగే అధికారులు ఎవరి ద్వారా ఆర్ఎంపీకి ఈ వ్యాధి సోకింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.