Wednesday, April 21, 2021

Latest Posts

కరోనా ఎఫెక్ట్ : ఏపీలో కీలక ఆదేశాలు

Corona Effect: Key Commands in AP due to Coronavirus (COVID19):

కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశంలో ఎప్పటికప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. ఇక ఏపీలో వైద్య, ఆరోగ్య, పోలీస్ అధికారులతో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏపీలో పటిష్ఠంగా లాక్‌డౌన్‌ అమలుచేయాలని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు అధికారులకు కొన్ని కీలక సూచనలు కూడా జగన్ చేశారు.

‘నిత్యావసరాలకు మాత్రమే బయటికి వచ్చేందుకు అనుమతించాలి. అత్యవసర సర్వీసులు తప్ప ఎవ్వరూ కూడా ఇళ్లు విడిచి బయటకు రావొద్దు. ఇతర రాష్ట్రాల నుంచి ఏ వాహనాలు కూడా రాకుండా అడ్డుకోవాలి. గూడ్స్‌, నిత్యావసర వస్తువుల వాహనాలు తప్ప ఏవీ తిరగొద్దు. నిత్యావసర దుకాణాలు తప్ప మిగతావి మూసేయాలి. ప్రతి కుటుంబం నుంచి ఒక్కరిని మాత్రమే అనుమతించాలి. వారిని కూడా 3 కి.మీ పరిధికే పరిమితం చేయాలి’ అని సమీక్షలో పోలీసు అధికారులకు సీఎం జగన్ సూచించారు.

కాగా ఆంధ్ర్రపదేశ్‌కు విదేశీయులు వస్తే స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వాలని రాష్ట్ర సీఎస్‌ నీలం సాహ్నీ సూచించారు. సోమవారం రాత్రి కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాహ్నీ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చివారిని వెంటనే హోమ్‌ ఐసోలేషన్‌కు తరలించాలని మరోసారి స్పష్టం చేశారు. ఏపీకి వచ్చిన విదేశీయులు తమ వివరాలను అధికారులకు వెల్లడించాలని.. లేదంటే కఠినచర్యలు తప్పవని వారిని హెచ్చరించాలని ఈ సందర్భంగా సాహ్నీ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదని.. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని సీఎస్‌‌ సూచించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss