Saturday, January 16, 2021

Latest Posts

కరోనాతో రూటు మార్చిన అమరావతి రైతులు

Corona effect on Amaravathi farmers protest:

అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆందోళనలు 94వ రోజు శుక్రవారం కొనసాగాయి. తుళ్లూరు, మందడంలో మహాధర్నా నిర్వహించాగా, వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, తాడేపల్లి, నీరుకొండ తదితర ప్రాంతాల్లో రిలే దీక్షలు, ఆందోళనలు సాగాయి. అయితే కరోనా నేపథ్యంలో కొంతకాలం పాటు దీక్షలు, ధర్నాలు విరమించుకోవాలని తుళ్లూరు మహాధర్నా శిబిరం సహా అన్ని శిబిరాలకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. కరోనా వైర్‌సకి బ్లీచింగ్‌ పౌడరు, పారాసిట్మాల్‌ సరిపోతాయని సీఎం స్వయంగా చెప్పినప్పుడు తమకు బెంగ లేదని మహిళలు వ్యంగ్యంగా వారితో అన్నారు.

అయితే కరోనా వైరస్ కారణంగా రైతులు గంట గంటకు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. తగు శుభ్రత పాటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాటలు లెక్క చేయాల్సిన పనిలేదు కానీ, వైరస్‌ నియంత్రణలో సహకరించలేదన్న అపవాదు వద్దు మనకు వద్దని టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, అశోక్‌బాబు, శ్రావణ్‌కుమార్‌ సూచించడంతో పోరాటం రూపం మారుద్దామని పిలుపునిచ్చారు.

వంతులువారీగా శిబిరాల్లో కూర్చొందామని 60 ఏళ్లు పైబడినవారు, పిల్లలను ఉద్యమానికి దూరంగా ఉంచాలని నిర్ణయించారు. వెలగపూడి శిబిరంలో భేటీ అయిన జేఏసీ నేతలూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో తమ ఉద్యమతీరును మార్చాలని రైతులు నిర్ణయించారు. అందులోభాగంగా దీక్షా శిబిరాల్లో అందరూ కాకుండా వంతులవారీగా గంటకు 20 మంది చొప్పున కూర్చోవాలని నిర్ణయించారు. అంతేకాదు శిబిరాల్లో ‘‘కరోనా పోవాలి.. అమరావతి కావాలి!’’ అంటూ రాజధాని రైతులు సరికొత్తగా నినదించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss