Monday, April 19, 2021

Latest Posts

ఆటో మొబైల్స్ పరిశ్రమపై కరోనా భారీ ప్రభావం

Corona effect on Auto Mobile Industry :

కరోనా ప్రభావం ఆటొ మొబైల్ ఇండస్ట్రీ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కార్ల అమ్మకాలు, కొనుగోళ్ళు నిలిచిపోవడం వలన తీరని నష్టాలను చూస్తున్నాయి, మళ్ళీ ఇంతకు ముందు పరిస్తితి రావడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే లగ్జరీ కార్లకు లైఫ్ లేకుండా పోయింది. డిమాండ్ తగ్గడంతో ఆయా సంస్థలు ఉత్పత్తిని ఆపివేశాయి. ఆటొ మొబైల్ రంగం ఎప్పుడు మళ్ళీ గాడిలో పడుతుందో చెప్పలేని పరిస్తితి.

కోట్ల మందిని వణికిస్తున్న కరోనా కార్ల జోరును కూడా తగ్గించేసింది. కరోనా దాటికి ఆటొ మొబైల్ రంగం కుదేలయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కార్ల అమ్మకాలు కొనుగోళ్ళు దారుణంగా పడిపోయాయి. అంతర్జాతీయ కార్య కలాపాలు రవాణా అన్నీ నిలిచిపోయాయి. రోడ్ల మీద పరుగులు పెట్టాల్సిన కార్లకు కరోనా బ్రేక్ వేసింది. కొత్త మోడల్ కార్ ఫస్ట్ డ్రైవ్ చేయాలని చూసిన వారి ఆశలపై కరోనా నీళ్ళు జల్లింది. మరి కొన్ని కంపెనీల కార్లు బుక్ చేసుకున్నా వాళ్ళకు దాని స్పేర్ పార్ట్స్ లేక సరైన సమయానికి అందించలేకపోతున్నాయి. కాగా కరోనా ఎఫెక్ట్ తగ్గాక వీటి హవా మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss