Sunday, January 17, 2021

Latest Posts

అత్తారింట్లోనే నితిన్ పెళ్లి

Corona effect on hero nithin & shalini wedding venue hyderabad:

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. పూర్వం ఇళ్ళదగ్గరే పందిళ్లు వేసి పెళ్లిళ్లు చేసేవారు. కానీ రాను రాను కల్యాణ మంటపాలు,పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో హాయిగా తక్కువమంది సమక్షంలో హీరో నితిన్ పెళ్లి జరుగబోతుందని అంటున్నారు. తను ప్రేమించిన షాలినీతో ఏప్రిల్ 16న డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగాల్సి ఉంది.

దుబాయ్‌లో ఈ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ కూడా చేశారు. ఏప్రిల్ 15న నిశ్చితార్థం, 16న పెళ్లి ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. అలాగే పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో ఏప్రిల్ 21న గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించాలని ఇరు కుటుంబాలు ప్లాన్ చేశాయి. అయితే కరోనా వైరస్ కారణంగా ఇతర దేశాలకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఇప్పుడు నితిన్ పెళ్లి చాలా సింపుల్‌గా జరపాలని ఇరు కుటుంబాలు భావించినట్లు టాక్.

ఏప్రిల్ 16న నితిన్ వివాహం తనకు కాబోయే భార్య ఇంటి వద్ద.. హైదరాబాద్‌లో అతి తక్కువ మంది సమక్షంలో జరపాలని నిర్ణయించారట. ఈ పెళ్లికి ఇతరులెవరినీ ఆహ్వానించడం లేదని, కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటారని వినికిడి. జనం కూడా గుమికూడావద్దని కరోనా హెచ్చరికల నేపథ్యంలో చెబుతున్నందున ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నితిన్, షాలినీ కుటుంబ సభ్యులు అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss