Tuesday, May 18, 2021

Latest Posts

నితిన్ పెళ్లి కి కరోనా ఎఫెక్ట్

Corona Effect On Hero Nitin & Shalini’s Wedding:

భీష్మ హిట్ తో ఖుషీగా ఉన్న టాలీవుడ్ లవర్ బాయ్ నితిన గుట్టుగా ప్రేమలో పడటం, పెళ్లి వరకూ వచ్చిన తర్వాత, అది కూడా అతడికి అతడే రివీల్ చేసిన తర్వాత మాత్రమే లవ్ మ్యాటర్ బయటకు రావటం చూస్తూనే ఉన్నాం. దీంతో అతడి పెళ్లికి సంబంధించిన వార్తల హడావుడి ఈ మధ్య ఎక్కువ అయింది. తన పెళ్లి దుబాయ్ లో గ్రాండ్ గా జరపాలని డిసైడ్ కావటమే కాదు.. రెండు కుటుంబాల వారు అందుకు తగ్గ ఏర్పాట్లు ముమ్మరంగా చేసేస్తున్నారు. అయితే తాను ప్రేమించిన షాలినితో పెళ్లికి సిద్ధమవుతున్న నితిన్ పాలిట కరోనా వైరస్ ఇప్పుడు విలన్ గా తయారైంది.

ఏప్రిల్ 15న ప్రీ వెడ్డింగ్, ఏప్రిల్ 16న పెళ్లి జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో విదేశీయులను పలు దేశాలు అనుమతించటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లటం అంత క్షేమకరం కాదన్న మాట ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో నితిన్ పెళ్లి వాయిదా తప్పదంటున్నారు. కరోనా దెబ్బతో దుబాయ్ లో పెళ్లి కుదరకపోతే, హైదరాబాద్ శివారులో చేయాలని ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ నెల 31 తర్వాత మ్యారేజ్ హాళ్ల బుకింగ్స్ రద్దు చేయాలని తెలంగాణా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో పెళ్లి వాయిదా తప్పదా అనే మాట వినిపిస్తోంది. కరోనా వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విందులు, వేడుకులకు దూరంగా ఉండాలని, ఎక్కువమంది ఒకచోట చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ సలహాలు ఇస్తున్నారు. దీంతో భారీగా చేపట్టాల్సిన వివాహవేడుకులకు వాయిదా మినహా మరో మార్గం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో నితిన్ పెళ్లి వాయిదా పడుతుందని అంటున్నారు. అయితే వాయిదాకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ వార్తలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss