Thursday, May 13, 2021

Latest Posts

కరోనా పోరాటానికి నితిన్ రూ 20లక్షలు

Corona effect:Nitin Donate Rs 20 lakh for CM funds:

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనాపై పోరాటానికి అందరూ చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైంది. పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకు బాసటగా నిలబడాల్సిన సమయమిది. వరదలు, ఉపద్రవాలు వచ్చినప్పుడు సెలబ్రిటీలు ఎలాగైతే ప్రభుత్వాలకు బాసటగా నిలిచేవారే.. ఇప్పుడు కూడా అలాగే సహాయం చేయాల్సిన సందర్భం వచ్చింది.

ప్రస్తుతం కరోనా కట్టడిపై దేశాలు, రాష్ట్రాలు దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుంది. ఇలాంటి సమయంలో కాస్త పేరున్నవారు, ధనవంతులు ప్రభుత్వాలను ఆదుకుని, వారిలోని మానవత్వాన్ని చూపించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఎందరో ముందుకు వస్తున్నారు.

ఆనంద్ మహీంద్ర వంటివారు ఎందరో తమ వంతు సాయం ప్రకటించారు. తాజాగా హీరో నితిన్, టాలీవుడ్‌లో ముందుగా తన వంతు సాయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అందించేందుకు ముందుకు వచ్చాడు. తెలంగాణ రాష్ట్రానికి రూ. 10 లక్షలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 10 లక్షలు సాయం చేస్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా నితిన్ ప్రకటించాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss