Corona fight:Junior NTR donates Rs 75lakh to Telugu states
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సినీ సెలబ్రిటీలు స్పందించడం సహజం. ఎవరికీ తోచిన రీతిలో వాళ్ళు విరాళం అందిస్త్తుంటారు. ఇక తాజగా వచ్చిన కరోనా వైరస్(కోవిడ్ 19) రోజు రోజుకూ విజృభిస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపడుతున్నాయి. అయితే టాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్స్ ఇప్పటికే తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటిస్తున్నారు.
చిరంజీవి, పవన్ వంటి ప్రముఖులెందరో ఇప్పటికే తమ వంత సాయం ప్రకటించారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీర్ రూ.75లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.25లక్షలు అంటే రెండు రాష్ట్రాలకు రూ.50 లక్షల విరాళంతో పాటు మరో రూ.25 లక్షలను కరోనా వైరస్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన రోజూవారీ సినీ పేద కళాకారులకు అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.