కరోనా మహమ్మారి వేటకు మానవాళి బలి అవ్వడం శోచనీయాంసమైతే, భారత్ లో దీని ప్రభావం మాత్రం అధికంగానే ఉంది. 130 కోట్ల జనాభా ఉన్న మన ఇండియా లో కరోనా లాంటి మహమ్మారిని లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు కట్టడి చెయ్యగలిగాము, అయితే సడలిస్తున్న లాక్ డౌన్ మార్గదర్శకాల కారణంగా కరోనా ప్రభావం ఇంతకింతకు పెరిగే అవకాశం లేకపోలేదు. కానీ ఇంత జనాభా భౌతిక దూరం పాటిస్తూ జీవనాన్ని గడపడం వసుధైక కుటుంబం అయిన ఇండియా లో కాస్త కష్టం.
ప్రస్తుతంకేసుల సంఖ్య అమాంతం వేలకు వేలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా 5 రాష్ట్రాల్లో విజృంభిస్తున్న తీరు చూస్తే పరిస్థితి అర్ధమవుతుంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 1,1900 కు చేరడంతో పాటు వీటిలో 80 శాతం కేసులు కేవలం 5 రాష్ట్రాల్లో నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, డిల్లీ, రాజస్తాన్ రాష్ట్రాల్లో కరోనా విధ్వంసం కొనసాగిస్తుంది. దీనిలో మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉంది, ఈ ఒక్క రాష్ట్రంలోనే 42 వేల కేసులు ఉండటం అంధోలన కలిగిస్తున్న అంశం.