Monday, May 10, 2021

Latest Posts

ఒకప్పుడు నెలకు లక్ష జీతం ఇప్పుడు రోజువారి కూలి

హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి కోట్లాది మంది జీవితాలను తలకిందులు చేసిన వేళ, వేల రూపాయల వేతనాలను పొందిన ఎంతో మంది, లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, ఇప్పుడు కూలీలుగా మిగిలారు. అటువంటి వారిలో హైదరాబాద్ కు చెందిన చిరంజీవి, పద్మ దంపతుల వాస్తవ గాధ ఒకటి బయటకు వచ్చింది. పీజీ, బీఈడీ చేసిన చిరంజీవి, ఎంబీఏ చేసిన పద్మలు టీచర్లుగా పనిచేస్తూ, లాక్ డౌన్ ముందు వరకూ ఎంతో ఆనందంగా గడిపారు. మంచి వేతనం తీసుకున్నారు. స్కూళ్లు మూతబడగా, వేతనాలు లేక, ఇద్దరూ ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఏ కార్యక్రమం కింద, ఉపాధి హామీ పథకంలో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు.

భువనగిరి – యాదాద్రి జిల్లాలోని వర్క్ సైట్ లో ఇద్దరూ రూ. 300కు పని చేస్తున్నారు. తమకు వేతనాలు లేవని, కరోనా ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో, ఉపాధి హామీకింద వచ్చే 200, 300 రూపాయలతో కనీసం తమ కుటుంబానికి కూరగాయలైనా కొనుగోలు చేయవచ్చన్న ఆలోచనతో ఈ పనికి వచ్చినట్టు చిరంజీవి వెల్లడించారు. తమ ఇంట్లో ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు సహా మొత్తం ఆరుగురం ఉన్నామని, జీతం రాని పరిస్థితుల్లో నెట్టుకురావడం అసాధ్యంగా మారిందని తెలిపారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss