తెలంగాణలో కరోనా మహమ్మారి రోజుజుకు విజృంభణ కొనసాగుతూనే వుంది.కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టినట్టుగానే పట్టి మళ్ళీ పాజిటివ్ కేసులు రోజురోజుకు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న 79కేసులు రాగా గడిచిన 24 గంటల్లో మరో 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే దీనిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 37 పాజిటివ్ కేసులు. ఈరోజు నమోదు అయ్యిన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1326కు చేరింది. వీరిలో 822 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం మృతుల సంఖ్య 32కు చేరింది. ప్రస్తుతం 472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన రెండు రోజులలో 100 కు పైగా కేసులు నమోదుయవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఇది కూడా చదవండి: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కేటీఆర్