Sunday, June 20, 2021

Latest Posts

89.66 శాతం ఉన్న కరోనా రికవరీ రేటు కానీ ఆందోళన కలిగిస్తున్న మరణాల సంఖ్య

Corona Recovery Rate In India

మొన్న రెండు లక్షలకు దిగువ కేసులు రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా తీవ్రత తగ్గిందేమో అనిపించింది. కానీ తీరా గడిచిన 24 గంటల్లో 2,11,298 కరోనా పాజిటివ్ కొత్త కేసులతో తీవ్రత ఇంకా తగ్గలేదని తెలుస్తుంది. దేశంలో 89.66 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య తగ్గకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఇకపోతే, మంగళవారం రెండు లక్షలకు దిగువ కేసులు నమోదు కావడంతో లాక్​డౌన్​ మంచి ఫలితాన్ని ఇస్తోందని, కరోనా విజృంభణ తగ్గుతోందని అనుకున్నారు. అయితే బుధవారం నుంచి మళ్లీ కేసుల సంఖ్య పెరుగుదల మొదలయ్యింది. గడచిన 24 గంటలలో 21,57,857 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, 2,11,298 మంది కోవిడ్ పాజిటివ్​గా తేలారు.

ఇక నిన్న దేశం మొత్తంగా కరోనాతో 3,847 మంది మృతిచెందినట్లు లెక్కలు చెప్తున్నాయి. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 3,15,235 మంది కరోనాతో చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులతో మరణాల రేటు 1.15 శాతానికి చేరుకుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss