Tuesday, April 13, 2021

Latest Posts

ఒకే ఫ్యామిలీలో 17మందికి  కరోనా …  

Corona symptoms were reported for 17 people in the same family

ఎంతగా చర్యలు తీసుకుంటున్నా కరోనా చుట్టుముట్టేస్తోంది. తాజాగా సోమవారం హైదరాబాద్   చార్మినార్ భవానీనగర్‌ తలాబ్‌కట్టలో లో ఒకే కుటుంబంలో 17 మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో  హై అలర్ట్ ప్రకటించారు.  కరోనా అనుమానితులందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల క్రితం కుటుంబంలో వృద్ధురాలు మృతి చెందారు. రెండు రోజులుగా కుటుంబంలో కొందరికి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. బాలాపూర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక  బాధిత కుటుంబంతో సన్నిహితంగా ఉన్న 45 మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు.

కాగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 11 మంది తబ్లిగీ జమాత్ సభ్యుల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 8 మంది ఇండోనేషియాకు చెందిన వారు కాగా.. ముగ్గురు భారతీయులు. ‘‘నిజాముద్దీన్ మార్కజ్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌కు హాజరైన ఎనిమిది మంది ఇండోనేషిన్లు.. ముగ్గురు స్థానికులతో కలిసి ఇక్కడి మల్లేపల్లి మార్కజ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం విధించిన నిబంధనలకు వ్యతిరేకం కావడంతో.. వారిని అరెస్ట్ చేశాము. వారిపై తగిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. క్వారంటైన్‌లో ఉంచాము’’ అని హజీబ్‌నగర్ ఇన్స్‌పెక్టర్ తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss