Sunday, July 25, 2021

Latest Posts

కరోనావైరస్ థర్డ్ వేవ్ ఈ కారణంగా విజృంభించవచ్చు

Corona Virus Third Wave Might Appear In India

కరోనా వైరస్ భారత దేశాన్ని గడ గడలాడించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే సెకండ్ వేవ్ వల్ల చాలా మంది ఈ వైరస్ బారీన పడ్డారు. ఇప్పుడు కరోనావైరస్ యొక్క థర్డ్ వేవ్  ‘డెల్టా ప్లస్’ వేరియంట్ కారణంగా విజృంభించవచ్చని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మూడవ వేవ్ ఉద్భవించినట్లయితే, రెండవ వేవ్ కంటే రోజుకు రెట్టింపు కేసులు నమోదు అవుతాయని మహారాష్ట్ర కోవిడ్ -19 టాస్క్‌ఫోర్స్ మరియు వైద్య నిపుణుల బృందం హెచ్చరించాయి.

దీనికి సంబంధించిన నివేదికలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు సమర్పించినట్లు మహారాష్ట్ర వైద్య అధికారులు తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, మూడవ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణుల సూచనల మేరకు అన్ని ప్రాంతాల్లో మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహారాష్ట్రలో, మొదటి వేవ్‌లో 19 లక్షల మందికి, సెకండ్ వేవ్ లో 40 లక్షల మందికి ఈ మాహమ్మారి సోకింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss