Coronavirus car’ spreads awareness on the pandemic
లాక్ డౌన్‌ను అందరూ విడిగా పాటించాలి అని ప్రభుత్వాలు ఎంతమొత్తుకున్న కొంతమంది వినడం లేదు. వారికి అవగాహన కలిపించ డానికి పోలీసులు, ప్రజా ప్రతినిదులు చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు . అలాగే తమవంతు బాధ్యత గా హైదరాబాదులోని ప్రజలకు అవగాహన కలిపించడానికి సుధాకార్ మ్యూజియం వారు కరోనా కారుని ఆవిష్కరించారు. కరోనా వైరస్ రూపంలో ఉండే కార్కు హండ్రెడ్ సి.సి ఇంజన్‌ను అమర్చారు. ఇది ఆరు చక్రాలను కలిగి ఉంది మరియు 100 సిసి ఇంజన్ ఉపయ్గించడం వల్ల 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదని కారు రూపకర్త సుధాకర్ యాదవ్ తెలిపారు.
వైరస్ యొక్క ఎరుపు కిరీటం లాగా ఫ్లోరోసెంట్-గ్రీన్ ఫైబర్‌తో తయారు చేయబడింది అని తెలిపారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు కూడా సహకరించారని, వాహనాన్ని గరిష్టంగా ఉపయోగించుకునేందుకు స్థానిక అధికారులకు దానం చేయాలని చూస్తున్నట్లు సుధాకర్ యాదవ్ తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పోలీసులు ధరించే వైరస్ ఆకారపు హెల్మెట్ల ద్వారా ఆయన ప్రేరణ పొంది దినిని తయారు చేసినట్లు తెలిపారు. ప్రజలంతా లాక్ డౌన్ ను పాటించాలి అనే ఉద్దేశ్యం తోనే దినిని తయారు చేశానని తెలిపారు.