తెలంగాణ కరోనా వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తంగా రాష్ట్రంలో నమోదయిన కరోనా కేసుల సంఖ్య 1699 కాగా, కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు ఇప్పటివరకు 1036 గా ఉన్నారు. కాగా రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 618 గా ఉంది.
గడచిన 24 గంటల్లో 23 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మరణాల సంఖ్య 45 కు చేరింది. నమోదయిన 38 కొత్త కేసులు నమోదయిన వివరాలు…. జిహెచ్సిఎం -26, రంగా రెడ్డి – 2, మైగ్రాంట్స్ -10 గా నమోదయ్యాయి. కాగా ఇప్పటివరకు వరంగల్ రూరల్, వనపర్తి, యదాద్రి ప్రాంతాలలో ఒక్క కేసు ఇప్పటివరకు నమోదు కాలేదు. ఈ ప్రాంతాలు జిహెచ్ఎంసి, రంగారెడ్డి తప్ప మిగిలిన 25 జిల్లాలలో ఒక్క కేసు కూడా గడచిన 14 రోజుల్లో నమోదు కాకపోవడం విశేషం.
ఇది కూడా చదవండి: