Wednesday, June 23, 2021

Latest Posts

కరోనా కష్టకాలంలో మందుబాబులు డొనేషన్ ఇస్తున్నారట

Coronavirus Donation

లాక్ డౌన్ సడలింపులో భాగంగా మద్యం షాపులు తీసుకోవచ్చని కేంద్రం సూచించడంతో చాలా రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే షాపుల దగ్గర జనం బారులు తీరి,సామాజిక దూరం పాటించకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. అప్పటికే మద్యంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 25 శాతం, ధరలు పెంచినా సరే, జనం పోటెత్తిపోయారు. దీంతో మర్నాడు మరో 50 శాతం ధరలు పెంచింది. మొత్తం 75 శాతం ధరలు పెంచుతూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అటు కేజ్రీవాల్ సర్కారు కూడా మద్యం ఏకపక్షంగా 70 శాతం ధరలు పెంచింది. మద్యం ధరల పెంపుపై మరిన్ని రాష్ట్రాలు అదే దిశగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న రాష్ట్రాలు మద్యం ధరలు అమాంతం పెంచడమే ఏకైక మార్గమని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక తెలంగాణాలో మద్యం దుకాణాలు తెరవడంతో పాటు ధరలు పెంచే విషయంపై నేడు స్పష్టత వచ్చే అవకాశముంది. ధరలు ఎంతగా పెంచినా సరే, జనం మాత్రం ఆగడం లేదు. ఆలోచించడం లేదు. పైగా గొప్పలు చెబుతూ మందుబాబులు అంటున్న మాటలు షాక్ కి గురిచేస్తున్నాయి. కరోనా కష్టకాలంలో దేశానికి డొనేషన్ ఇస్తున్నామని మందుబాబులంటున్నారు. అదెలా అంటే మద్యంపై కరోనా స్పెషల్ ఫీజ్ పేరుతో ఆయా ప్రభుత్వాలు భారీగా ధరలు పెంచేశాయి. ధరలు ఆకాశాన్నంటుతున్నా మద్యం ప్రియులు మాత్రం కిలోమీటర్ల కొద్దీ లైన్లలో నిల్చుంటున్నారు.

ఏపీతో పాటు మద్యం అమ్మకాలు జరుగుతున్న అన్ని చోట్లా కిలోమీటర్ల కొద్దీ మద్యం ప్రియుల లైన్లు దర్శనమిస్తున్నాయి. ధరల పెంపుపై మందుబాబులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. తమకు ధరలు ముఖ్యం కాదని, కిక్ ముఖ్యమ ని చెప్పేస్తున్నారు. దేశం కష్టకాలంలో ఉన్న తరుణంలో తాము డొనేషన్లు ఇస్తున్నట్లేనని అంటున్నారు. మద్యం ధరలు పెంచినా తాము కొంటున్నామని, దీన్ని దేశానికి తామిచ్చే డొనేషన్‌గా భావించాలని మద్యం ప్రియులు చెబుతున్నారు. ఈ తరుణంలో కరోనా సోకకుండా తమను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని చెబుతున్నారు. ఎక్కువ సేపు లైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా త్వరత్వరగా అమ్మకాలు జరిపేలా చూడాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss