Sunday, June 13, 2021

Latest Posts

నితిన్ పెళ్ళికి కరోనా ఎఫెక్ట్ – మరి వేదిక మారుతుందా

coronavirus effect on tollywood hero nithin marriage:

ఎవరికైనా పెళ్లి కాకపొతే,వయస్సు దాటిపోతుంటే, పెళ్లికాని ప్రసాద్ అనే జోక్ వింటుంటాం. వెంకటేష్ సినిమాలో ఈ డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఇక మన తెలుగు ఇండస్ట్రీలో ఇలా పెళ్లికాని ప్రసాదు లు చాలామంది ఉన్నారు. అయితే ఇటీవల ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకొని ఒక ఇంటివారు అవుతున్నారు. ఈ మధ్యనే హీరో నితిన్ తన సీక్రెట్ లవ్ ను ఓపెన్ చేసి.. తన పెళ్లి ముచ్చటను చెప్పేయడంతో పెద్దలు నిర్ణయించినట్లుగా ఏప్రిల్ 16న డెస్టినేషన్ వెడ్డింగ్ కింద దుబాయ్ లో చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

Nitin shalini marriage

నిశ్చితార్ధం కూడా గ్రాండ్ గా జరిగింది. అయితే, ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, దుబాయ్ లో పెళ్లి అనుమానంగా మారింది. ఇంకేముంది, ఆటోమేటిక్ గా పెళ్లి డేట్ మీద కొత్త సందేహాలు వచ్చేస్తున్నాయి. అయితే.. నితిన్ సన్నిహితుల నుంచి వస్తున్న మాటలను బట్టి చూస్తే, పెళ్లి అనుకున్న తేదీన.. అనుకున్న ముహుర్తానికి జరపాలని డిసైడ్ అయ్యారట. కరోనా కారణంగా దుబాయ్ లో పెళ్లి ఇబ్బందిగా మారితే వేరే చోటకు మార్చాలని నిర్ణయించారట.

Nitin shalini marriage

హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ముందుగా అనుకున్న దాని ప్రకారం నితిన్ పెళ్లి దుబాయ్ లోని ప్రఖ్యాత హోటల్ ప్లహేజో వర్చసలో జరగాల్సి ఉంది. వివాహ అనంతరం గ్రాండ్ రిసెప్షన్ మాత్రం ఏప్రిల్ 21న హైటెక్స్ లో నిర్వహించాలని భావించారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పెళ్లి దుస్తుల్ని కంచి, చెన్నైలలో షాపింగ్ పూర్తి చేశారు. అనుకున్న ముహుర్తానికే పెళ్లి జరుగుతుందని, కాకుంటే వేదికలో మార్పు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss