Coronavirus effect will open theaters after lockdown
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసింది. అన్ని రంగాలను కుదిపేసింది. చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయి. ఇక భారత్ లో లాక్ డౌన్ పొడిగింపు కూడా నడుస్తోంది. ఇక సినిమాలు ఆగిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. సెలబ్రిటీలు ఇంటికి పరిమితం అయ్యారు. అయితే సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయనే దానిపై సినీ పరిశ్రమలో అందరూ చర్చించుకుంటున్నారు.
వచ్చే నెల మూడో తేదీన లాక్డౌన్ ఎత్తేసినా సినిమా థియేటర్లకు పర్మిషన్ ఇచ్చే అవకాశం కనబడడం లేదు. ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా జనం ఇంతకు ముందులా థియేటర్లకు వస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి ఇప్పట్లో థియేటర్లను తిరిగి ఓపెన్ చేయకపోవడమే మంచిదని కొందరు సినీ పెద్దలు అనుకుంటున్నారట. జూన్లో థియేటర్లను ఓపెన్ చేసినా జనాలు వచ్చేందుకు సిద్ధంగా ఉండరు.
ఎందుకంటే, అది స్కూళ్లు, కాలేజీలు తెరిచే సమయం కావడమే. పైగా కరోనా భయం. అలాగే ఇప్పటికిప్పుడు విడుదలవడానికి సినిమాలేవీ సిద్ధంగా లేవు. చాలా సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. కాబట్టి ఆగస్టుకు వరకూ థియేటర్ల జోలికి వెళ్లకపోవడమే మంచిదని అనుకుంటున్నారట. ఆగస్టులో కొన్ని సినిమాలు విడుదల చేస్తే, దసరా నాటికి పూర్తి రొటీన్లో పడొచ్చని భావిస్తున్నారట.