Sunday, June 20, 2021

Latest Posts

కరోనాని ఎదిరించాలంటే పాటించాల్సిన భోజన నియమాలు

Coronavirus Food Telugu:

కరోనా నుంచి కోలుకునేవారికి ప్రభుత్వం కొన్ని ఆహార నియమాలను సూచిస్తోంది. ఈ భోజన నియమాలతో నిస్సత్తువ, నీరసం వదిలి, కోలుకునే వేగం పెరుగుతుంది.

ఈ కరోనాని తొందరగా జయించాలంటే పాటించాల్సిన భోజన నియమాలు ఇవే:

నిద్ర లేచిన వెంటనే: నీళ్లలో నానబెట్టిన బాదం , ఎండు ద్రాక్ష తినాలి. బాదంలో మాంసకృత్తులు, ఎండు ద్రాక్షలో ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొవిడ్ తాలూకు నీరసాన్ని వదిలిస్తాయి.

అల్పాహారం: రాగి దోశ లేదా పోరిడ్జ్ ఉత్తమమైన అల్పాహారం.

మధ్యాహ్న భోజనం: మధ్యాహ్న భోజనంతో లేదా భోజనం తర్వాత తీసుకునే పదార్థాలతో పాటు నెయ్యి, బెల్లం తినాలి. వీటిని రోటీతో కలిపి కూడా తినవచ్చు.

రాత్రి భోజనం: రాత్రి భోజనంలో కిచిడి తింటే అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. తేలికగా అరగడంతో పాటుమంచి నిద్ర పడుతుంది.

లిక్విడ్స్: ఎక్కువగా నీళ్లు తాగాలి. నీళ్లతో పాటు నిమ్మరసం, మజ్జిగ తాగాలి.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss