coronavirus impact on indian Weddings
పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవి అంత చాపలు పరిచేసి కోట్లు ఖర్చు కుమ్మరించేవారు. విందు,చుట్టాలు , వందలాది కాదు వేలాది మందికి భోజనాలు,అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. లక్షలు ఖర్చుచేసి పెద్ద కల్యాణ మండపాలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు కరోనా దెబ్బతో పెళ్లిళ్లే కాదు.. పండుగలు పబ్బాలను కూడా తక్కువ మందితో దగ్గరి స్నేహితులతోనే చేసు కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక ఫంక్షన్ హాల్లు – సెట్టింగులకు కాలం చెల్లినట్టే . పూర్వం మాదిరిగా ఇంటి ముందు పందిరి వేసుకుని తక్కువ జనంతో కానిచ్చేసే పరిస్థితి వచ్చేసింది. ఇక ఇప్పుడు కరోనా కారణంగా వివాహాలు కూడా ఆన్ లైన్ లో జరుగుతున్నాయి.
దేశంలో ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా – ఏప్రిల్ – మే, జూన్ నెలలలో ముందే షెడ్యూల్ చేయబడిన అనేక వివాహాలు వాయిదా పడ్డాయి. ప్రయాణాలు నిషేధంతో రాకపోకలు లేక ప్రజలు ఏ వేడుకలకు హాజరు కాలేని పరిస్థితి నడుస్తోంది. అయితే కొంతమంది తమ వేడుకలను వాయిదా వేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆన్ లైన్ లో పెళ్లి చేసుకొని డిజిటల్ లో అందరికీ చూపించాలని అదే రోజున పెళ్లికి రెడీ అవుతున్నారు.ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ యాప్ ‘జూమ్’ ద్వారా తమిళనాడులో ఒక జంట వివాహం చేసుకున్నారు. పాస్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో చేరారు. తరువాతి ప్రార్థనలు చేసి ఈ తంతును ఆచారాలతో పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు కొత్త జంటను వీడియో కాల్స్ ద్వారా ఆశీర్వదించారు. అంతేకాదు, రాయ్ పూర్ లో కూడా – పూజారి శ్లోకాలు పఠించి వధువు తండ్రితో డిజిటల్ కన్యాదానం చేయించారు. లాక్ డౌన్ మధ్య ఒక జంట ఆన్ లైన్ లో వివాహం చేసుకున్నారు.
కాగా తమిళనాడులోని సేలం జిల్లా ఆర్కాడు నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే చిత్ర-గుణశేఖర్ దంపతుల కుమార్తె సింధు (21), ధర్మపురి జిల్లా పాపిరెట్టిపట్టికి చెందిన విద్యుత్ బోర్డు ఇంజనీర్ ప్రశాంత్‌ల వివాహం ముఖ్యమంత్రి ఎడప్పాడి నియోజకవర్గమైన వాళప్పాడి లో ఏప్రిల్ 26న సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం నేతృత్వంలో జరుగుతుందని వివాహ పత్రికలు ముద్రించారు. అయితే రాష్ట్రంలో లాక్డౌన్ అమలులో ఉన్న తరుణంలో ఆదివారం ఉదయం వాళప్పాదిలోని కాంద నేశ్వరర్ ఆలయంలో హిందూ సంప్రదాయ బద్ధంగా జరిగింది. పురోహితుడు, ఫొటోగ్రాఫర్ సహా 14 మంది మాత్రమే హాజరయ్యారు.