Monday, March 8, 2021

Latest Posts

కరోనా దెబ్బకు వణికిపోతున్న మహారాష్ట్ర

దేశంలోని కరోనా ప్రభావం ఒకలా ఉంటే ఒక మహారాష్ట్రాలో ఒకలా ఉంది, మొత్తం భారత దేశం నమోదయిన కేసులు 78 వేలు అయితే ఒక్క మహారాష్ట్రాలోనే 26 వేల కేసులు నమోదయ్యాయి. సుమారు 33 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయన్నది అంధోలన కలిగించే అంశం.

మహారాష్ట్రలో 36 జిల్లాలు ఉండగా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలలో మాత్రమే ఈ కరోనా విజృభిస్తుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోనే 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పోలీసు శాఖకు కూడా ఈ కరోనా ఎఫెక్ట్ పడింది. సుమారు 700 మంది ఈ కరోనా భారీన పడినట్టు తెలుస్తుంది.

ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సిబ్బందికి కరోనా సెగ తగలడంతో సెక్యూరిటి గా ఉన్న 170 మంది పోలీసులు ఇతర అధికారులు క్వారంటైన్ కు వెళ్లారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాస భవనం ఉన్న సమీపంలో ఒక చాయి వాలాకి కరోనా సోకగా వారి నుంచి పోలీసులకు సోకినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ధారావి ప్రాంతంలో వైరస్ విజృంభిస్తుండడంతో మహారాష్ట్రాకు కేంద్రానికి కంటి మీద కునుకు లేకుండా పోతుంది.

ఇది కూడా చదవండి: అండర్ వరల్డ్ డాన్ మృతి….

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss