Thursday, May 13, 2021

Latest Posts

కరోనాతో అట్టుడికిపోతున్న ఇటలీ

Coronavirus: Italy reports biggest daily jump in death tolls:

కరోనా మహమ్మారి అన్ని దేశాలను కుదిపేస్తోంది … చైనా ,ఇటలీ ,అమెరికా,బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన ధనిక దేశాలను కరోనా గజగజ వణికిస్తోంది. ఇక  కరోనా మృత్యుఘోషతో ఇటలీ అట్టుడికిపోతోంది. ఇప్పటికే వేలసంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి మృత్యు ఒడిలోకి చేరిపోతున్నారు. దీనిని అరికట్టేందుకు, ఆ మహమ్మారి బారి నుంచి తమ ప్రజలను కాపాడుకునేందుకు ఇటలీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవీ తగిన ఫలితాలనివ్వడం లేదు.

గత 24 గంటల్లోనే 662 మంది కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని కన్నుమూశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరితో కలుపుకొని ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 8,165కు చేరింది.  అంతేకాకుండా దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య కూడా 74,386 నుంచి 80,539కి పెరిగినట్లు ఆ దేశ సివిల్ ప్రోటెక్షన్ ఏజెన్సీ వెల్లడించింది.

ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్న బాధితులు కూడా 3,489 నుంచి 3,612కు పెరిగారని సంస్థ తెలిపింది. అయితే దీనికి విరుగుడు ఒకటే. మనం సామాజిక దూరం పాటించడం, ఇది అన్ని చోట్లా .. అంటే ఇంట్లో, బయట, పనిచేసే చోట, నిత్యావసర వస్తువులు కొనుగోచేసేటప్పుడు, షాపుల్లో.. మనం సామాజిక దూరం పాటిస్తే మంచిది. లాక్ డౌన్ పాటించడమే ఉత్తమం అని’మనవాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అక్కడి పరిస్థితులు చూసాకైనా మారాలని అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss