Sunday, June 13, 2021

Latest Posts

దేశం లో 75 జిల్లాలు లాక్ డౌన్ – కేంద్రం కీలక నిర్ణయం !!!

Coronavirus lockdown 75 districts

దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న 75 జిల్లాలను మర్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా డిస్ట్రిక్ కలెక్టర్లుకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో 75 జిల్లాలలో అత్యవసర సేవలు మినహా మిగతా సర్వీసులు పూర్తిగా బంద్ కానున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలో  లాక్ డౌన్ అవ్వనున్న జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలు…తెలంగాణ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాలు ఉన్నట్లు సమాచారం.

lockdown

రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్‌లు, కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కార్యదర్శి.. ఇతర ముఖ్య అధికారులులో చర్చించిన అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కరోనాను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ తప్ప మరో ఆప్షన్ లేదని అధికారులందరూ ఒకే అభిప్రాయాన్ని వెల్లిబుచ్చినట్టు సమాచారం. ప్రధాని జనతా కర్ఫ్యూకు ప్రజలు సహకరిస్తోన్న నేపథ్యంలో..ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss