coronavirus lockdown impact on indian marriages
పెళ్లిళ్లులకు కరోనా బాజాల తో బ్రేక్, తద్పాలితంగా బోసిపోయిన కల్యాణమండపాలు. శ్రావణమాసంలో మౌఢ్యం రావడంతో గత సంవత్సరం మంచి ముహూర్తాలు లేక శుభకార్యాలు, పెళ్లిలు అంతంతమాత్రంగానే జరిగాయి. మరి ఇప్పుడు, సంవత్సరం ప్రారంభం నుంచి మంచి ముహూర్తాలు ఉన్న పెళ్ళిళ్లు ఇతర శుభకార్యాలు చేయ్డానికి పెద్దలు సిద్దమయ్ సరికి కరోనా తో మరోసారి బ్రేక్ పడ్డాయి. చెప్పాలంటే ఈ టైమ్ లో పట్టణం పల్లె అనే తేడా లేకుండా అన్ని చోట్లా వేల సంఖ్యలో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండేవి. ఇందుకు కారణం వేసవి సెలవలు రావడం, మరియు ముహూర్తలు కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉండటం.
అలా పెళ్లిలు జరగడం తో చాలా సందడిగా కళ్యాణ మండపాలు ఉండేవి. అలా జరిగే పెళ్లిల మీద సన్నాయి మేళం, పురోహితులు, క్యాటరింగ్, ముత్యాల మండపాలు, ఇలా చాలామందికి జీవనోపాది. కాన్ని ఈ కరోనా వల్ల చాలావరకు పెళ్లిళ్లు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 2,500 వరకు పెళ్లిళ్లు నిరవధికంగా వాయిదా పడినట్లు సమాచారం అలాగే ఇతర శుభ కార్యాలు ప్రస్తుత పరిస్థితుల్లో వద్దనుకొని వాయిదా వేసుకున్నారు.
ఇలా శుభకార్యాలు వాయిదా పడటంతో వీటినే నమ్ముకున్న సన్నాయి మేళం, పురోహితులు, క్యాటరింగ్, ముత్యాల మండపాలతో పాటు ఇతర రంగాలు త్రీవంగా నష్టపోయారు. వీరితో పాటు వ్యాపారులు, కార్మికులు కొన్ని కోట్ల మేర వారికి నష్టం వట్టిలిందని వాపోతున్నారు.