Corona positive cases cross 900 mark in Andhra pradesh(AP)
రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 80 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 893కి చేరుకుంది.
ఇవాళ ఒక్కరోజే కర్నూల్లో- 31, గుంటూరులో -18, చిత్తూరు-14 కొత్త కేసులు నమోదవ్వడం గమనార్హం. నిన్న 56 కేసులు నమోదు అవ్వగ గడచిన 24 గంటల్లో అనూహ్యంగా కేసులు పెరగడం గమనార్హం. ఇప్పటి వరకూ కరోనాపై పోరాడి కోలుకుని 141 మంది డిశ్చార్జ్ కాగా 27 మంది మరణించారు. ప్రస్తుతం 725 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు హెల్త్ బులెటిన్‌లో ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. గడిచిన 24 గంటల్లో 6522 శాంపిల్స్‌ను సేకరించి టెస్ట్‌లు చేయగా 80 మంది పాజిటివ్ అని తేలింది.