coronavirus spread in telugu states:
ఒక జబ్బుకి మందు కనుక్కుంటే,మరో జబ్బు వెంటాడుతోంది. తాజాగా చైనాలోని వుహాన్ లో ఉద్భవించిన కరోనా మహమ్మారి ఇపుడు ప్రపంచాన్నేవణికిస్తోంది. చైనా వ్యాప్తంగా విస్తారించి వేల సంఖ్యలో ప్రజల ప్రాణాల్ని హరించేసింది. ఇప్పటి వరకు ఈ వైరస్ 64దేశాలకు పాకింది. ప్రపంచ వ్యాప్తంగా 90వేల931 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3వేల125మంది చనిపోయారు. తాజాగా ఈ వైరస్ తెలంగాణ కి పాకింది అంటున్నారు. బెంగళూరు నుంచి బస్సులో వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరుకు వైరస్ సోకినట్లు నిర్ధారించారు. బస్సులో వచ్చిన ఇతర ప్రయాణికులకు పరీక్షలు చేసారు.
ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన బాధితుడికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇదిలాఉండగా.. వైరస్ బారినపడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగికి తొలుత చికిత్స అందించిన సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రి సిబ్బంది కూడా గాంధీకి క్యూ కట్టారు. వారికి కరోనా నిర్ధారిత పరీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు తాజాగా ఎనిమిది మంది కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చేరారు. వారంతా ఇటలీ ఇండొనేషియా ఇజ్రాయెల్ జపాన్ నుంచి వచ్చారని అంటున్నారు .
కరోనా లక్షణాలు కనపడడంతో ఆసుపత్రిలో చేరారు. ఈంపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీ ఉస్మానియా ఫీవర్ ఆస్పత్రుల్లో కరోనా పై హై అలర్ట్ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. అలాగే ఎవరికైనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనుమానం వచ్చినా కూడా వెంటనే గాంధీకి వచ్చి పరీక్షలు చేపించుకోవాలని ప్రభుత్వం చెప్తుంది. కాగా తిరుపతిలో కూడా కరోనా కలకలం సృష్టించడంతో భక్తులు వణికిపోయారు. ముందస్తు చర్యలు చేపట్టాలని భక్తులు మొరపెట్టుకుంటున్నారు.