Thursday, December 2, 2021

Latest Posts

కరోనా థర్డ్‌ వేవ్ లేనట్టేనా

Coronavirus third wave

ప్రస్తుత పరిస్థితులలో అందరి మదిలో ఒకటే ప్రశ్న,  కరోనా థర్డ్‌ వేవ్ ఉన్నట్ట లేనట్ట! ఈ విషయమై కొన్ని పరిశోధన సంస్థలు కరోనా థర్డ్‌ వేవ్ ఆగస్టులో వస్తుందని, మరికొందరు సెప్టెంబర్‌లో వస్తుందని కొన్ని రోజులుగా చేబుతు న్నారు. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ నుంచి బయట పడుతున్నమన్న సంతోషం లేకుండానే ఈ వార్త వల్ల  ప్రజలు ఆందోళన చెందవలసి వస్తుంది . దేశంలో ప్రస్తుతం రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న ఒక పక్క థర్డ్‌ వేవ్ ఎప్పుడు మొదలవుతుందో అనే భయం అందరి మదిలో మెదులుతుంది. కాగా సెకండ్‌ వేవ్‌లో కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నా అంత వేగంగా కేసుల సంఖ్య తగ్గటం లేదు. కొన్ని రోజుల క్రితం కేసుల సంఖ్య అనుకోని విధంగా తగ్గినా ప్రస్తుతం మాత్రం కేసుల తగ్గుదలలో వేగం తగ్గింది.  దీంతో అప్పుడే ఇండియాలో థర్డ్ వేవ్ త్వరలో ప్రారంభవుతుంది అన్న వాదన ఇంకా బలపడింది.

కాగా గడిచిన కొన్ని రోజులలో దేశంలో  తాజాగా 30వేలకు పైగా కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య కూడా ఐదు వందలకు పైగా నమోదయ్యాయని కేంద్రం తెలియజేసింది. కాగా గురువారం తెలిపిన కరోనా బులిటెన్ ప్రకారం 16 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే 35,342 మందికి పాజిటివ్‌ వచ్చింది. 24 గంటల వ్యవధిలో 483 మంది కరోనాతో మరణించారు. ఈ కేసుల తగ్గుదల ఓ మంచి పరిణామమే దీన్ని చూస్తే ఇంకా కరోనా థర్డ్ వేవ్ ఇండియాలో ప్రారంభం కాలేదనిపిస్తోంది. కానీ ఎన్ని లెక్కలు వేసిన ప్రజలు వారి జాగ్రత్తలో వారు ఉంటే కరోనా థర్డ్ వేవ్ ఐన ఫోర్త్ వే ఐన ఎదుర్కోగలం. ప్రజలు థర్డ్ వేవ్ వస్తుందా రాదా అన్న విషయాలను పక్కన పెట్టి, జాగ్రతలు పాటిస్తే ఇప్పటికైనా మంచిది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss