Home రాజకీయం 24 గంటల విద్యుత్ సరఫరా – కేంద్రం

24 గంటల విద్యుత్ సరఫరా – కేంద్రం

coronavirus:Central Govt announced 24 Hour Power Supply:

లాక్ డౌన్ కొనసాగుతున్న సమయం లో విద్యుత్ కొరత ఉండకూడదని, 24గంటలు విద్యుత్ సరఫరా చెయ్యాలి అని కేంద్ర ఇంధన శాఖ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ  నైపద్యంలో విద్యుత్ రంగంలో సహాయ చర్యలకు కేంద్రం ఇంధన శాఖ ఆమోదం తెలిపింది. లాక్ డౌన్ వేళ 24 గంటల విద్యుత్ సరఫరాకు కట్టుబడి ఉన్నామన్న కేంద్రం ప్రభుత్వం.  ఆలస్యంగా జరిగే చెల్లింపులపై జరిమానాలను మూడు నెలలపాటు తాత్కాలిక నిషేధాన్ని విధించాలని సి.ఈ.ఆర్.సి కి ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రాలను కోరిన కేంద్రం.

బొగ్గు ఆధారిత ప్లాంట్ల నుంచే 70% విధ్యుత్ ఉత్పత్తి జరుగుతోంది అందువల్ల బొగ్గు సరఫరాకు అంతరాయం రాకుండా నిరంతరం సరఫరా జరిగేటట్లు రైల్వేతో మాట్లాడతామన్నారు.  లాక్ డౌన్ వల్ల కరెంట్ బిల్లులను చెల్లించక పోవడామ్ డిస్కంలకు పై ప్రభావం పడుతుంది.  తద్వారా ఉత్పత్తి, ప్రసార సంస్థలకు చెల్లించే సామర్ద్యం దెబ్బతింటుందన్న కేంద్రం. అందువల్ల ఉత్పత్తి, పంపిణీ సంస్థల మధ్య బకాయిలున్నా సరఫరా చెయాలని మంత్రి ఆర్.కె.సింగ్ ఆదేశించారు.  డిస్కంలకు విద్యుత్ సరఫరాలో తగ్గింపు ఉండదని తెలిపారు. మే నెల వరకు పంపిణీ సంస్థల సెక్యూరిటి డెపాజిట్లను 50% తగ్గించినట్లు తెలిపారు.

Exit mobile version