ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతలో భాగంగా అగ్రిగోల్డ్ సంస్థలో రూ.10 వేలులోపు డిపాజిట్ చేసిన బాధితులకు సొమ్మును అందించారు. ఇప్పుడు అగ్రిగోల్డ్ సంస్థలో రూ.20 వేల లోపు సొమ్ము డిపాజిట్ చేసి. నష్టపోయిన బాధితులకు త్వరలో ఆ మొత్తాన్ని చెల్లించనుంది. న్యాయస్థానాల పరిధిలో ఉన్న ఈ అంశంపై హైదరాబాద్ హైకోర్టు నుంచి ఆదేశాలు రాగానే బాధితులకు సొమ్ము అందజేస్తారు. అయితే రూ.10 వేలులోపు డిపాజిట్ చేసిన బాధితులు ఎవరికైనా మొదటి విడతలో ఆ సొమ్మును అందకపోయి ఉంటే వారికి కూడా చెల్లింపులు జరుపుతారు. ఈ విషయాన్ని రాష్ట్ర సీఐడీ విభాగం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: