Sunday, June 20, 2021

Latest Posts

దిగివచ్చిన కొవ్యాక్సిన్ సంస్థ ప్రజల్లో ఊరట

Covaxin To Share Their Formula

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో దేశమంతా వ్యాక్సిన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీనితో ప్రభుత్వం ఇచ్చే వ్యాక్సిన్ల శాతం సరిపోవడం లేదు. కావున దాని ఉత్పత్తిని ఎలా చేస్తున్నారనే దానిని వేరే వాళ్ళకు చెప్పాలని ప్రభుత్వం కొవ్యాక్సిన్ సంస్థను కోరింది. అయితే మాకు ప్రభుత్వం నుంచి అందిన సహాయం నామమాత్రమే, అంతా మేమే చేసుకున్నాం,అందువల్ల మా సాంకేతికతను వేరే వాళ్లతో పంచుకునేది లేదు అంటూ కోవాగ్జీన్ సమాధానం ఇచ్చింది.

అయితే ఇలా చెప్పిన కొన్ని రోజులకే తన మాటను మార్చుకుంది కొవ్యాక్సిన్ సంస్థ. తమ సాంకేతికతను రెండు ప్రభుత్వ సంస్థలతో పంచుకోవడానికి దిగివచ్చింది. భారత్ ఇమ్యూనోలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ , ఇండియన్ ఇమ్యూలాజికల్స్ లిమిటెడ్ సంస్థలకు తన సాంకేతికను కోవాగ్జీన్ బదిలీ చేయనుంది. దీనితో ఇప్పుడు వ్యాక్సిన్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది.

అలాగే మహరాష్ట్రకు చెందిన హాఫ్ కిన్ అనే ప్రయివేట్ ఫార్మా కంపెనీతో కూడా ఉత్పత్తి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కుదిరిన ఒప్పందాలు ఏమిటో? ఇది కోవాగ్జీన్ కు ఏ మాత్రం లాభమో, నష్టమో అన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. కానీ ఇలా చేయడానికి ఈ మూడు సంస్థలకు కోవాగ్జీన్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీగా ఆర్థిక సహాయం అందించినట్లు సమాచారం.

ప్రస్తుతం దేశంలో రోజుకు దాదాపు 20 లక్షల వరకు వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఇలా చూస్తే దేశం మొత్తం వ్యాక్సినేషన్ పూర్తి కావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మరో మూడు సంస్థలు చేరడంతో ఉత్పత్తి తొందరగా జరిగి వ్యాక్సినేషన్ తొందరగా పూర్తి అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss