Covid-19 does not leave the family of kings
రాజుల కుటుంబంలోను ప్రకంపనలు రేపుతున్న కోవిడ్-19. న్యూయార్క్ టైమ్స్(ఎన్వైటీ) పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం, సౌదీ అరేబియా రాజు సల్మాన్ కుటుంబానికి చెందిన 150 మందికి కరోనా భారీన పడినట్లు తెలిపింది. రియాద్ గవర్నరైన రాకుమారుడొకరు ఇప్పటికే ఐసీయూలో చికిత్స పొందుతున్న పొందుతున్నారని అందులో పేర్కొంది.
కింగ్ ఫైజల్ ఆస్పత్రుల్లో ఇప్పటికే ఉన్న కేసుల్ని వైద్యులు త్వరగా పంపించేస్తున్నారని. ప్రత్యేకమైన వైద్యులు రాజకుటుంబీకులకు అంతర్గతంగా జాగ్రత్తలు సూచించారని వెల్లడించింది. రాజ కుటుంబానికి చెందిన అనేక డజన్ల మంది సభ్యులు కూడా అనారోగ్యానికి గురయ్యారు.
ఆసుపత్రి అధికారులు పంపిన అంతర్గత “హై అలర్ట్” ప్రకారం, మొత్తం సౌది వంశ సభ్యులకు చికిత్స చేసే ఉన్నత ఆసుపత్రి వైద్యులు ఇతర రాయల్స్ మరియు వారికి దగ్గరగా ఉన్నవారి కోసం 500 పడకలను సిద్ధం చేస్తునట్లు తెలిపారు. ఇక, సౌదీ రాజు సల్మాన్(84) జెడ్డాకు సమీపంలోని ఒక దీవిలోని రాజప్రాసాదంలో ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. రాజకుమారుడు సల్మాన్, తన కుమారుడు, ఇతర మంత్రులతో కలిసి అదే దీవిలోని మరోచోట ఉన్నట్లు ఎన్వైటీ స్పష్టం చేసింది.