Wednesday, January 20, 2021

Latest Posts

ఏపీలో 132కి చేరిన కరోనా కేసులు  

COVID-19:Corona cases reaching 132 in AP

మొన్నటివరకూ ఒక ఎత్తయితే ఆతర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో సీన్ మారిపోయింది.  ఏపీలో కరోనా పాజిటివ్‌ వచ్చినవారిలో అత్యధికులు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌కు వెళ్లొచ్చినవాళ్లేనని ప్రభుత్వం గుర్తించింది. ఢిల్లీ నుంచి వచ్చినవారిలో 758 మందిని అధికారులు గుర్తించారు. వాళ్లతో సన్నిహితంగా మెలిగిన వారిలో 543 మందిని ఇప్పటి వరకూ గుర్తించారు.

ఇక  226 మంది విదేశాల నుంచి వచ్చినవారు కాగా, వాళ్లతో కాంటాక్ట్‌లో ఉన్నవారు 130 మందిగా గుర్తించడం జరిగింది. మరో 143 మందికి కూడా వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. ఏపీలో మొత్తం 1800 మందికి టెస్ట్‌లు చేయగా 1175 మందికి నెగిటివ్‌ అని వచ్చింది. ఇంకా ఇంకా 493 మంది రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం నాడు మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో 132కు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య చేరింది. కేవలం 12 గంటల వ్యవధిలో మరో 21కొత్త కేసుల నమోదు కావడం గమనార్హం. గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకూ అత్యధికంగా 20 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇంతవరకూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss