Friday, June 25, 2021

Latest Posts

క్వారంటైన్ సెంటర్ లో అగ్నిప్రమాదం..

COVID-19:Fir in mumbai quarantine center in Nagpada

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అగ్నిప్రమాదం జరిగింది,అది కూడా ఓ క్వారంటైన్ సెంటర్ లో  జరిగింది. దాదాపు 5 ఫైర్ ఇంజన్లు, నాలుగు జంబో ట్యాంకర్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కరోనా వైరస్‌ రోగులకు క్వారంటైన్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న దక్షిణ ముంబైలోని నాగపాద ప్రాంతంలోని రిప్పన్‌ హోటల్‌లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఆ హోటల్‌ కోవిడ్ -19 క్వారంటైన్ సెంటర్ గా  పనిచేస్తుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని వైద్యులు పేర్కొన్నారు. మూడు అంతస్తుల భవనంలో క్వారంటైన్ సెంటర్ ఉందని ఇందులో పలు ప్రాంతాలకు చెందిన బాధితులు ఉన్నట్లు, ఈ భవనంలోని లాడ్జింగ్‌ రూం వరకే మంటలు పరిమితమవడంతో పెను ప్రమాదం తప్పిందని అగ్నిమాపక ప్రధాన అధికారి తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss