Monday, October 25, 2021

Latest Posts

3 రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న కోవిడ్ కేసులు

COVID Cases Dip In India

భారత్ కోవిడ్ కేసులు మూడో రోజు స్వల్పంగా తగ్గినట్లు రిపోర్ట్స్ సూచిస్తున్నాయి. 4 లక్షల అత్యధిక సింగిల్-డే స్పైక్‌ను దాటిన తరువాత, గత 3 రోజులుగా స్వల్పంగా కేసులు తగ్గినట్లుగా తెలుస్తుంది. అయితే, గత 24 గంటల్లో దేశంలో 3.55 లక్షలకు పైగా కేసులు మరియు 3436 మరణాలను నమోదు అయ్యాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చూపిన గణాంకాల ప్రకారం, దేశంలో 3,55,680 తాజా కేసులు, 3436 కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ఢిల్లీలో కొత్తగా 18,043 కేసులు మరియు 448 మంది మరణాలు సంభవించాయి. చివరి 24 గంటల్లో మహారాష్ట్రలో 48,621 కేసులు, 567 మరణాలు నమోదయ్యాయి. ఉత్తర ప్రదేశ్‌లో 29,052 కేసులు, 285 మంది మరణించారు.

గత 24 గంటల్లో 5695 కరోనా కేసులు, 49 మరణాలు తెలంగాణలో సంభవించాయి. అలానే ఆంధ్రప్రదేశ్‌లో 18,972 తాజా కేసులు, 71 మరణాలు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss