Sunday, June 20, 2021

Latest Posts

గంగా నదిలోకి కోవిడ్ రోగి మృతదేహాన్ని విసిరేస్తున్న వైరల్ వీడియో

COVID Patient Being Thrown Into Ganga River

భారతదేశంలో ప్రతి రోజు గడిచేకొద్దీ కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో, అనేక మృతదేహాలు ఉత్తర ప్రదేశ్‌లోని గంగా నదిలో తేలుతుండడంతో ప్రజలలో అనేక భయాలు మరియు ఆందోళనలను రేకెత్తించాయి. అయితే ఇప్పటి వరకు, ఎవరు మరియు ఎప్పుడు మృతదేహాలను నదిలోకి విసిరారు అనేదానికి రుజువు లేదు.

తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో కనిపించింది, దీనిలో కోవిడ్ రోగి యొక్క శవం నదిలో విసిరివేయబడింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని బల్రాంపూర్ జిల్లాలో జరిగింది. ఇద్దరు వ్యక్తులు మృతదేహాన్ని నదిలో విసిరిన వీడియో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు చిత్రీకరించడం జరిగింది.

వైరల్ వీడియోలో ఇద్దరు వ్యక్తులు మృతదేహాన్ని ఎత్తి, మృతదేహాన్ని వంతెన పై నుంచి నదిలోకి విసిరినట్లు చూపిస్తుంది. ఇద్దరు వ్యక్తులలో ఒకరు పిపిఇ కిట్ ధరించి ఉన్నారు. ఈ శవం మరణించిన కోవిడ్ రోగి అని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సిఎంఓ) ధృవీకరించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. రోగి బంధువులు మృతదేహాన్ని నదిలోకి విసిరారని సమాచారం. వీడియోలోని ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss