Sunday, June 20, 2021

Latest Posts

వ్యాక్సినేష‌న్ విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందా

COVID Vaccine Updates Today

దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య కాస్త త‌గ్గుముఖం ప‌ట్టినా, మరణాల సంఖ్య ఆందోళన పెట్టిస్తుంది. అంతే కాకుండా రోజుకు రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు పైగా కేసులంటే మాట‌లేమీ కాదు. చిన్న చిన్న గ్రామాల్లో కూడా క‌రోనా కార‌ణ మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. తొలి వేవ్ లో క‌రోనా నీడ కూడా ప‌డ‌ని గ్రామాలు సెకండ్ వేవ్ లో మాత్రం వణికి పోతున్నాయి.

అయితే సెకెండ్ వేవ్ మరి కొన్ని రోజుల్లోనే త‌గ్గుముఖం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వ్యాక్సినేష‌న్ గురించి కూడా విశ్లేషకులు నొక్కి చెబుతున్నారు. వ్యాక్సినేష‌న్ భారీ ఎత్తున జరిగితేనే మళ్ళీ థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ వంటివి రావని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో దేశంలో ప్ర‌స్తుతం వ్యాక్సినేష‌న్ ప‌రిస్థితి ఏమిటి అని ఆరా తీస్తే, ప్ర‌స్తుతం రోజుకు 20 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సినేష‌న్ జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది.

ఈ ఏడాది డిసెంబ‌ర్ కల్లా మన దేశంలో క‌నీసం రెండు వంద‌ల కోట్ల డోసేజ్ ల వ్యాక్సినేష‌న్ జ‌రుగుతుంద‌ని ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించుకుంది. మ‌రి ఆ టార్గెట్ రీచ్ కావ‌డానికి ఇలాంటి 20 ల‌క్ష‌ల నంబ‌ర్ ఏర‌కంగానూ స‌రిపోదు. రోజుకు 20 ల‌క్ష‌ల చొప్పున వేసుకుంటూ పోతే.. రెండు వంద‌ల కోట్ల‌ డోసేజ్ ల వ్యాక్సినేష‌న్ జ‌ర‌గ‌డానికి క‌నీసం రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఆలోపు దేశం క‌రోనా మూడో వేవ్ ను, నాలుగో వేవ్ ను కూడా ఎదుర్కుంటుందేమో అనిపిస్తుంది.

మరి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే రోజుకు క‌నీసం 90 ల‌క్ష‌ల నుంచి కోటి మందికి వ్యాక్సినేష‌న్ జ‌ర‌గాల‌ని, అప్పుడే ఈ ఏడాది డిసెంబ‌ర్ నాటికి దేశంలో రెండు వంద‌ల కోట్ల డోసేజ్ ల వ్యాక్సినేష‌న్ పూర్త‌వుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం మేల్కొని రోజుకు కోటి మందికి సరిపడా వ్యాక్సినేషన్ వేస్తే బాగుంటుంది.

ఇప్పటికే సెకెండ్ వేవ్ ను అంచ‌నా వేయ‌డంలో విఫలం అయిన మోడీ ప్ర‌భుత్వం మూడో వేవ్ ను ఎదుర్కొన‌డానికి అయినా సిద్ధంగా ఉండాలి. అందుకు మన దగ్గర ఉన్నదల్లా ఒక్కటే దారి. వీలైనంత‌గా వ్యాక్సిన్ డోసేజ్ ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డ‌మే అని వైద్యులు స్ప‌ష్టం చేస్తున్నారు. మ‌రి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కళ్ళు తెరుస్తుందో మూడో వేవ్ కి అయినా సిద్ధం అవుతామో లేదో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss