Tuesday, January 25, 2022

Latest Posts

కరోనాను చెక్ పెట్టేందుకు వార్మ్ వ్యాక్సిన్

Covid Warm Vaccine

కరోనాను చెక్ పెట్టేందుకు మరో వ్యాక్సిన్ సిద్ధం అవుతోంది. అదే వార్మ్ వ్యాక్సిన్ (ఉష్ణ టీకా).  వార్మ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలను ఇవ్వడంతో త్వరలో అది అందుబాటు లోనికి రానున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  కరోనా ఫస్ట్ వేవ్‌, సెకండ్ వేవ్‌ అన్ని దేశాల్ని అతలాకుతలం చేసింది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ పొంచి ఉందనే హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయ్. వాటితో పాటుగా ఆల్ఫా, బీటా, డెల్టా అంటు రకరకాల కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడున్న వ్యాక్సిన్లు వాటిపై అంతగా ప్రబావం చూపడం లేదని కొందరు అంటున్నారు.

కాగా వాటన్నిటిని అడ్డుకట్ట వెయ్యడానికి వార్మ్ వ్యాక్సిన్ను రుపొందిచిన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ గనుక వస్తే కరోనాకు దానితో పాటుగా వచ్చే వేరియంట్లకు అడ్డుకట్ట పడుతుందని అంచనా. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకునే వ్యాక్సిన్ పై జరుగుతున్న పరిశోధనలు మంచి ఫలితాలు ఇచ్చాయ్. ఇప్పుడు ఉపయోగిస్తున్న వ్యాక్సిన్లు కోల్డ్‌ స్టోరేజీలో భద్రపరచాల్సి ఉండగా ఇకపై ఆ అవసరం లేని వార్మ్ వ్యాక్సిన్లను తిసుకురాన్నునారు. భారత్-ఆస్ట్రేలియా సంయుక్తంగా శాస్త్రవేత్తలు వినూత్న పరిశోధనల్లో ముందడుగు వేశారు. అన్ని రకాల వేరియెంట్లపైనా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఎలుకలపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో తేలింది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss