Monday, April 19, 2021

Latest Posts

మార్కిస్టుల రూటే వేరు – స్థానికంలో కీలక నిర్ణయం

CPM decides to go it alone in Ap localbody elections:

మొత్తానికి రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపడానికి నోటిఫికేషన్ రావడంతో అధికార వైసిపి,ప్రతిపక్ష టిడిపి తమ సత్తా చాటాలని కసరత్తు చేస్తున్నాయి. వైసిపి సొంతంగా దిగుతుంటే, స్థానిక సంస్థలతో పాటు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీడీపీ-సీపీఐ కూటమిగా ఏర్పడి రంగంలో దిగుతున్నాయి. ఇక జనసేనలో కల్సి బిజెపి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. అయితే వామపక్షాల్లో ఒకటైన మార్క్సిస్టు పార్టీ మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం పార్టీ నిర్ణయించింది. సిద్ధాంతాలకు విరుద్ధంగా కూటమికట్టిన టీడీపీ, సీపీఐలకు దూరంగా ఉండాలని పార్టీ ముఖ్యనేతలు నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై అనుసరిచాల్సిన వ్యూహాలపై మంగళవారం విజయవాడలో సీపీఎం ముఖ్యనేతలు సమావేశమై చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను  మీడియా సమావేశంలో వెల్లడించారు. బీజేపీ, టీడీపీ కూటములతో కాకుండా భావసారూప్యత గల చిన్న చిన్న పార్టీలతో కలిసి ముందుకెళ్లాలనే కామ్రేడ్లు నిర్ణయించారు.

చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రజా వ్యతిరేక విధానాలకు, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని ఈ నేపథ్యంలో వారితో పొత్తుకు దూరంగా ఉండాలని సీపీఎం అభిప్రాయపడింది. అధికారంలో ఉండగా చంద్రబాబు ఏనాడూ వామపక్షాలను లెక్క చేయలేదని, వివిధ సందర్భాల్లో ప్రజా సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమన్న పట్టించుకోలేదని పేర్కొన్నారు. అధికారం పోయిన తరువాత వామపక్షాలు గుర్తుకు వచ్చాయా అంటూ సీపీఎం నేతలు చంద్రబాబు ని ఎద్దేవా చేస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss