Crane operator booked for accident that killed 3 on film set of Indian 2:
నా మీద పడిన బాగుండేది-బాధలో శంకర్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రాబోతోన్న చిత్రం ఇండియన్ 2 (భారతీయుడు 2). ఈ మూవీ సెట్లో గత వారం ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్స్ దుర్మరణం చెందగా.. పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఒక్కసారిగా కోలీవుడ్‌ను ఉలిక్కి పడేలా చేసింది.
ఈ దుర్ఘటనపై కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ స్పందించారు. తాజాగా దర్శకుడు శంకర్ ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. భారతీయుడు 2 సినిమా షూటింగ్ చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతుండగా.. 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి కింద పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కృష్ణ (34), మరో సహాయకుడు చంద్రన్ మృతి చెందారు.
అది నా మీద పడినా బాగుండేది.. ‘ఈ ఘటన జరిగినప్పటి నుంచి నేను నిద్ర లేని రాత్రులు గడుపుతూనే ఉన్నాను.. ఆ క్రేన్ నాపైన పడినా బాగుండేది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, వారంతా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను అత్యంత బాధతో ఈ ట్వీట్ చేస్తున్నాను. నా అసిస్టెంట్ డైరెక్టర్, నా బృందాన్ని కోల్పోయిన షాక్‌లోంచి నేను రాలేకపోతున్నా’ను అంటూ ఎమోషనల్ అయ్యాడు.