Home క్రీడలు బ్రిటీష్‌ గడ్డపై టీం ఇండియా 75 వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు

బ్రిటీష్‌ గడ్డపై టీం ఇండియా 75 వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు

75th Independence Day, 99telugu, Cricket Stars Celebrate the 75th Independence Day, Indian cricketers Independence Day, Team India hoist flag

Cricket Stars Celebrate the 75th Independence Day

బ్రిటీష్‌ గడ్డపైనే మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది భారత క్రికెట్ జట్టు. భారతదేశం 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లండన్‌లో ఉన్న టీమిండియా స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను అక్కడ జరుపుకుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న భారత క్రికెట్ జట్టు తాము బస చేసిన హోటల్ వద్ద ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి భారత జెండాను ఎగురావేసి జాతీయగీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జట్టు సభ్యులు, వారి కుటుంబసభ్యులతోపాటు ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచే లార్డ్స్‌ మైదానానికి బయల్దేరి వెళ్లారు.

ఇది కూడా చదవండి:

 

 

Exit mobile version