Monday, July 26, 2021

Latest Posts

సి‌ఎం జగన్ ని కలిసిన అనిల్ కుంబ్లే ఎందుకంటే

Cricketer Anil Kumble Meets AP CM YS Jagan

క్రికెట్ చరిత్రలో గొప్ప బౌలర్లలో ఒక్కడైన భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సోమవారం ఏపీ సి‌ఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. టెస్ట్ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టిన కుంబ్లే ఆంధ్రప్రదేశ్‌లో స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి తన మద్దతును అందించేందుకు ముందుకు వచ్చాడు. అనిల్ కుంబ్లే రాష్ట్రంలో క్రీడల అభివృద్ధితో సహా పలు అంశాల పై జగన్ తో చర్చించారు.

రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తే తన పూర్తి సహకారాన్ని అందిస్తానని కుంబ్లే చెప్పారు. ఈ ప్రముఖ లెగ్ స్పిన్నర్ రాష్ట్రంలో స్పోర్ట్స్ మెటీరియల్స్ తయారీ యూనిట్లను స్థాపించడం పై ఎక్కువ దృష్టి పెట్టాలని కోరారు. స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీని నిర్మించాలని మాజీ బౌలర్ జగన్‌ కు తెలిపాడు. అన్ని రకాల క్రీడా సామాగ్రి జలంధర్ మరియు మీరట్ నుండి మాత్రమే లభిస్తుంది. ఏపీ లో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే, అది అందరికీ ఉపయోగపడుతుంది ”అని అనిల్ కుంబ్లే వైయస్ జగన్ కి తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss